570 stones in woman’s stomach: మహిళ కడుపులో రాళ్ల గుట్టలు బయటపడ్డాయి. దీంతో వైద్యులు షాక్ అయ్యారు. ఈ సంఘటన అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో జరిగింది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. మహిళ కడుపులో 570 రాళ్లు, అరుదైన సర్జరీతో తొలగించారు అమలాపురంలో వైద్యులు.
గాల్ స్టోన్స్ సమస్య తో ఆసుపత్రిలో జాయిన్ అయింది ఓ మహిళ. అయితే.. ఆ మహిళ తీవ్ర ఇబ్బంది పడుతుండటంతో అత్యవసరంగా సర్జరీ చేసింది ASAఆసుపత్రి వైద్యుల బృందం. ఈ సందర్భంగా మహిళ కడుపులో ఉన్న 570 రాళ్లు తొలగించారు డాక్టర్లు. ఇప్పుడు ఈ సంఘటన వైరల్ గా మారింది.