ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్. బంగాళాఖాతం, దక్షిణ అండమాన్ సమీపంలో రేపు అల్పపీడనం ఏర్పడనుందని వెల్లడించింది. ఇది ఈ నెల 29 నాటికి వాయుగుండంగా బలపడుతుందని తెలిపింది. దీని ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమలో ఆరు రోజులపాటు మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
ఇవాళ అల్లూరి, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాలో తేలికపాటి వానలు కురుస్తాయని చెప్పింది. ఓవరాల్ గా ఏపీలో 6 రోజుల పాటు వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ పేర్కొంది.
ఇక తెలంగాణ రాష్ట్రంలో నేడు, రేపు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. తెలంగాణలో దిగువ ట్రోపో ఆవరణలో తూర్పు గాలులు వీస్తున్నాయని…. వీటి ప్రభావంతో తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా రాబోయే రెండు రోజుల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు.