తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం

-

తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్ అలెర్ట్. తిరుమల శ్రీవారి 16 కంపార్టుమెంట్లలో భక్తులు వేచివున్నారు. దింతో నిన్న ఒక్కరోజే తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. నిన్న ఒక్కరోజే తిరుమల శ్రీవారిని 69,874 మంది భక్తులు దర్శించుకున్నారు. నిన్న ఒక్కరోజే 26,034 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. అటు తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.39 కోట్లుగా నందుకు అయింది.

ttd

కాగా, ఇవాళ అయోధ్యకు తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదాలు తరలి వెళ్ళనున్నాయి. ఈనెల 22వ తేదీన అయోధ్య రామ మందిరం ప్రారంభం ఉన్న నేపథ్యంలో శ్రీవారి లడ్డూలను తీసుకుపోనున్నారు. ఏకంగా లక్ష లడ్డూలను తరలిస్తున్నారు అధికారులు. స్వచ్ఛమైన ఆవు నెయ్యితో తయారుచేసిన శ్రీవారి లడ్డు ప్రసాదం ప్రత్యేక కార్గో విమానంలో అయోధ్యకు వెళ్లనుంది. ఇందులో భాగంగానే తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదాలను తిరుమల శ్రీవారి సేవ సదన్ నుంచి రేణిగుంట విమానాశ్రయానికి శుక్రవారం సాయంత్రం తరలించారు. ఇవాళ సాయంత్రం రేణిగుంట ఎయిర్పోర్ట్ నుంచి అయోధ్యకు లడ్డూలు వెళ్ళనున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version