ఏపీ విద్యార్థులకు అలర్ట్. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో 11 ప్రభుత్వ బోధనాస్పత్రుల్లో 94 పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం అనుమతించింది.కార్డియాలజీ విభాగంలో ప్రొఫెసర్, అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను శాశ్వత ప్రాతిపాదికన, మిగిలిన పోస్టులను కాంట్రాక్ట్ ప్రాతిపాదికన భర్తీ చేయనున్నారు. ఇటీవల వైద్య విధాన పరిషత్ ఆసుపత్రుల్లో 331 మంది స్పెషలిస్ట్ డాక్టర్లను ప్రభుత్వం భర్తీ చేసిన విషయం తెలిసిందే.
కాగా,ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గ్రామా మరియు వార్డు సచివాలయ ఉద్యోగులకు మరో శుభవార్త చెప్పింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ప్రభుత్వ ఉద్యోగులకు అమలు చేస్తున్న ఆరోగ్య పథకం గ్రామ మరియు వార్డు సచివాలయ ఉద్యోగులకు కూడా అమలు చేసేందుకు నిర్ణయం తీసుకుంది ఏపీ సర్కార్. సచివాలయ, వ్యవసాయ మార్కెట్ కమిటీలలో పనిచేసే ఉద్యోగులకు ఎంప్లాయిస్ హెల్త్ స్కీం అమలుకు చర్యలు తీసుకున్నట్లు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణ బాబు… ఏపీ ప్రభుత్వానికి స్పష్టం చేశారు.