ఒంటిపై రంగు పూసుకుని భిక్షాటన చేస్తున్న బాలుడి వీడియో ఇవాళ ఉదయం నుంచి వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. తన తల్లికి పక్షవాతం, తండ్రి వికలాంగుడని చెబుతూ బాలుడు భిక్షాటన చేస్తున్నాడు. అయితే…ఈ వీడియో తీసి ఎక్స్ లో పోస్ట్ చేశాడు ఓ వ్యక్తి. ఇక ఈ వీడియో చూసి చలించిపోయాడు మంత్రి నారా లోకేశ్. బాలుడి కుటుంబానికి అన్నగా అండగా ఉంటానని ప్రకటించారు నారా లోకేశ్.

ఆడుతూ పాడుతూ, పెరగాల్సిన వయసులో కుటుంబ భారాన్ని భుజాన వేసుకున్న ఈ బాలుడి మాటలు వింటుంటే నా హృదయం చలించిపోయింది. తల్లిదండ్రులకు అండగా ఉండటం కోసం ఆ బాలుడు పడుతున్న కష్టం నన్ను కలచివేసింది. వెంటనే బాలుడు వివరాలు సేకరించి ఆ కుటుంబానికి ఒక అన్నగా అండగా ఉంటానని మాట ఇస్తున్నానంటూ నారా లోకేష్ ప్రకటించారు.
ఆడుతూ పాడుతూ, పెరగాల్సిన వయసులో కుటుంబ భారాన్ని భుజాన వేసుకున్న ఈ బాలుడి మాటలు వింటుంటే నా హృదయం చలించిపోయింది. తల్లిదండ్రులకు అండగా ఉండటం కోసం ఆ బాలుడు పడుతున్న కష్టం నన్ను కలచివేసింది. వెంటనే బాలుడు వివరాలు సేకరించి ఆ కుటుంబానికి ఒక అన్నగా అండగా ఉంటానని మాట ఇస్తున్నాను. https://t.co/FmMOK6tcsk
— Lokesh Nara (@naralokesh) March 7, 2025