నటి శ్రీరెడ్డి పై కేసు నమోదు

-

సినీ నటి శ్రీరెడ్డి పై తూర్పు గోదావరి జిల్లా బొమ్మూరు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయింది. టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పద్మ శ్రీ రెడ్డి పై ఫిర్యాదు చేసారు. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హోమంత్రి అనిత పై శ్రీరెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆ ఫిర్యాదులో తెలిపారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసారు.

మరోవైపు అనకాపల్లి పోలీస్ స్టేషన్ లో కూడా శ్రీ రెడ్డి పై టీడీపీ మహిళా ఉపాధ్యక్షురాలు కొణతాల రత్నకుమారి, చెన్నా సత్యవతి, యర్రంశెట్టి ఈశ్వరి, కె.వసంత ఫిర్యాదు చేశారు. మరోవైపు నాలుగు రోజుల కిందట సోషల్ మీడియాలో తాను చేసిన వ్యాఖ్యలపై క్షమించాలని కోరారు. భవిష్యత్ లో ఇలా చేయనని ఆమె తెలిపారు. నాయకులతో యుద్ధం చేయాలని.. కార్యకర్తలతో చేయవద్దని కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news