Kadapa: కడప జిల్లా జమ్మలమడుగులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటో, బొలెరో వాహనాలు ఢీ కొట్టుకున్నాయి. ఈ ప్రమాదంలో ఏకంగా 12 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. జమ్మలమడుగు పెన్నానది వద్ద ఉన్న అయ్యప్ప స్వామి గుడి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది.
ముద్దనూరు నుంచి పెద్దముడియం మండలం పెద్దపసుపుల గ్రామానికి శనగ పంట కోతకు వెళ్తున్న కూలీల ఆటో… ఎదురుగా వస్తున్న బొలెరో వాహనం ఢీ కొట్టుకున్నాయి. ఈ ప్రమాదంలో… ఆటో డ్రైవర్, 12 మంది కూలీలకు తీవ్ర గాయాలు అయ్యాయి. అటు క్షతగాత్రులను 108 వాహనంలో జమ్మలమడుగు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు స్థానికులు. అటు రంగంలోకి దిగిన పోలీసులు..ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఈ ప్రమాదంపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.