కాంగ్రెస్ నేత వి హనుమంతరావు కీలక వ్యాఖ్యలు చేశారు. బైక్ లకు చలాన్లు వేయకూడదని… ట్రాఫిక్ పోలీసులను రిక్వెస్ట్ చేశారు హనుమంతరావు. ట్రాఫిక్ పోలీసులు టూ వీలర్స్ ను టార్గెట్ గా చేసి చలాన్లు వేస్తున్నారని ఫైర్ అయ్యారు.

ప్రభుత్వం చొరవ తీసుకొని చలాన్లు వేయకుండా పోలీసులకు సూచనలు కూడా చేయాలని ఆయన ఈ సందర్భంగా వెల్లడించారు. రాబోయే పంచాయతీ ఎన్నికల్లో యువత చాలా కీలకమని… వారిని చలానా పేరుతో ఇబ్బంది పెట్టవద్దని ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేశారు హనుమంతరావు. గత సర్కార్.. కాంగ్రెస్ కార్యకర్తలపై నమోదు చేసిన కేసులు కూడా ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. దీనిపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రత్యేక చర్య తీసుకోవాలని కూడా కోరారు హనుమంతరావు.