ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష హోదాపై… స్పీకర్ అయ్యన్నపాత్రుడు కీలక ప్రకటన చేయడం జరిగింది. తనకు ప్రతిపక్ష హోదా అర్హత ఉందంటూ జగన్మోహన్ రెడ్డి అసంబద్ధ వాదన చేస్తూ… రచ్చ చేస్తున్నారని మండిపడ్డారు. దీనిపై 2024 జూన్ మాసంలో 24వ తేదీన కూడా లేఖ రాసినట్లు గుర్తు చేశారు.

అందులో అభ్యర్థన లేకుండా అభియోగాలు అలాగే బెదిరింపులు చేశారని మండిపడ్డారు ఏపీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు. కొద్దిరోజుల తర్వాత హైకోర్టుకు కూడా వెళ్లారని తెలిపారు. దీనిపై న్యాయస్థానం స్పీకర్కు సమానులు జారీ చేసినట్లు జగన్మోహన్ రెడ్డి తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటిదేమీ జరగలేదని క్లారిటీ ఇచ్చారు అయ్యన్నపాత్రుడు.