తిరుమల శ్రీవారి సన్నిధిలో… చిరుతపులి మరోసారి కలకలం అయిపోయింది. తిరుమల కొండపై చిరుత పులి హల్చల్ చేసింది. నిన్న అంటే మంగళవారం సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో అన్నమయ్య భవన్ వద్ద చిరుత పులి కనిపించింది. దీంతో భయాందోళనకు గురయ్యారు తిరుమల శ్రీవారి భక్తులు. అటవీ అధికారులు సైరన్ మోగించడంతో అడవిలోకి చిరుత పులి వెళ్ళింది.

ఈ సంఘటన ఎప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తిరుమల వెళ్లే భక్తులు కచ్చితంగా జాగ్రత్త పాటించాలని అధికారులు చెబుతున్నారు. లేకపోతే ఇలాంటి సంఘటనలు జరుగుతాయని హెచ్చరిస్తున్నారు. చిరుతల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేస్తున్నారు.