ఏపీలోని అనకాపల్లి నర్సీపట్నంలో దారుణం చోటు చేసుకుంది. ఓ వృద్దురాలి పై మైనర్ బాలుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన నిన్న చోటు చేసుకోగా ఇవాళ వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన వివరాల్లోకి వెళితే… నర్సీపట్నంలోని రావికమతం మండలం జెడ్ కొత్తపట్నం గ్రామంలో ఈ దారుణం చోటు చేసుకుంది. 60 ఏళ్ల వృద్ధు రాలి పై 16 ఏళ్ల మైనర్ బాలుడు అత్యాచారం చేశాడు.
అధిక రక్తస్రావం కావడంతో బాధితురాలిని నర్సీపట్నం ఏరియా ఆసుపత్రికి తరలించారు స్థానికులు.
ప్రథమ చికిత్స అనంతరం పరిస్థితి అదుపులోకి రానందున మెరుగైన వైద్యం కోసం విశాఖ కే. జి.హెచ్ కు తరలించారు. ఇక సంఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఆత్యాచారం చేసిన 16 ఏళ్ల మైనర్ బాలుడు.. పరారీలో ఉన్నట్లు సమాచారం అందుతోంది. ఎవరూ లేని సమయంలో… వృద్ధురాలిపై లైంగికదాడి చేశాడట ఈ 16 ఏళ్ల మైనర్ బాలుడు. ఇది వరకు కూడా చాలా సార్లు ఈ సంఘటన జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు.