విజయవాడలో ఓ సింగర్ యువకులను మోసం చేసి ఏకంగా ఆరు పెళ్లిళ్లు చేసుకుంది. బందరు రోడ్డులోని పబ్ లో సింగర్ గా పనిచేస్తున్న మహిళ 20 ఏళ్ల క్రితం వివాహం చేసుకుంది. అయితే భర్తతో విభేదాలు కారణంగా విడాకులు తీసుకుంది. విడాకుల తర్వాత పబ్ లో సింగర్ గా పనిచేస్తున్న ఆ మహిళ అక్కడికి వచ్చిన వారిని పరిచయం చేసుకొని ట్రాప్ చేసినట్లుగా సమాచారం అందుతుంది.

అలా ఒకరికి తెలియకుండా మరొకరిని ఏకంగా ఆరు వివాహాలు చేసుకుంది. పెళ్లి తర్వాత వారిని బ్లాక్ మెయిల్ చేసి వారి వద్ద నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు కాజేసింది. కొత్తపేటలో బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. దీంతో ఆ మహిళా భాగోతం బయటకు వచ్చింది. ఈ విషయం తెలుసుకున్న ఆ యువకులు ఒకరి తర్వాత మరొకరు వారికి జరిగిన అన్యాయాన్ని వెల్లడిస్తున్నారు. ఈ సంఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.