అమర్నాథ్ యాత్రకు ఈరోజు బ్రేక్ పడింది. వర్షాల కారణంగా అమర్నాథ్ యాత్రకు ఈరోజు బ్రేక్ ఇచ్చారు అధికారులు. J&K లోని పహాల్గాం, బల్తాల్ బేస్ క్యాంప్ వద్ద యాత్రికులను అధికారులు నిలిపివేశారు. ట్రాక్స్ లో మెయింటెనెన్స్ వర్క్స్ చేయాల్సి ఉందని చెప్పారు. అయితే ఇప్పటికే పంచ తరణి క్యాంపు వద్దకు చేరుకున్న భక్తులను మాత్రమే దర్శనానికి అనుమతిస్తున్నారు.

రేపటి నుంచి యధావిధిగా యాత్ర కొనసాగే అవకాశం ఉందని ఆలయ అధికారులు స్పష్టం చేశారు. కాగా ఇప్పటివరకు 2. 47 లక్షల మంది భక్తులు అమర్నాథ్ దేవుడిని దర్శనం చేసుకున్నారు. ఈరోజు వర్షపాతం అధికంగా ఉన్న నేపథ్యంలో ఒక్కరోజు మాత్రమే యాత్రను నిలిపి వేస్తున్నామని ఆలయ అధికారులు స్పష్టం చేశారు. అమర్నాథ్ యాత్రకు బయలుదేరే భక్తులు రేపు దర్శనానికి రావాలని చెబుతున్నారు.