కేబినెట్ ముగిసిన తరువాత మంత్రులతో సీఎం ప్రత్యేక సమావేశం

-

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన మంత్రి వర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అయితే కేబినెట్ సమావేశం తరువాత మంత్రులతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు సీఎం చంద్రబాబు. పలు కీలక అంశాలపై చర్చించారు. నెలలో నాలుగు రోజులు మంత్రులు, ఎమ్మెల్యేలు పల్లె నిద్ర చేయాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమం ద్వారా విధిగా గ్రామాల్లో ఉండి సమస్యలు తెలుసుకోవాలని సూచించారు.

ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ఇచ్చినా కూడా సరిగ్గా చెప్పలేకపోతున్నామని మంత్రులకు చెప్పారు సీఎం చంద్రబాబు. మన రాష్ట్రంలో లబ్దిదారుల కంటే ఇతర రాష్ట్రాల్లో లబ్దిదారులు చాలా తక్కువ. అయినా కూడా పథకాలకు సంబంధించి సరిగ్గా చెప్పుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు మంత్రులు పల్లెల్లో బస చేసే కార్యక్రమానికి పల్లె వెలుగు.. స్వర్ణగ్రామం అని పేరు పెట్టాలని కేబినెట్ లో చర్చించారు. ఈ పేరుతో పాటు మరికొన్ని పేర్లు పరిశీలించాలని సూచించారు. ఈ కార్యక్రమానికి త్వరలో విధి, విధానాలు ఖరారు చేయనున్నట్టు మంత్రులకు తెలిపారు సీఎం నారా చంద్రబాబు నాయుడు.

Read more RELATED
Recommended to you

Latest news