కొత్త జిల్లాల ఏర్పాటులో ముంద‌డుగు.. కేబినెట్ ఆమోదం

ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్రంలో కొత్త జిల్లాల‌ను ఏర్పాటు చేయాల‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యించిన విష‌యం తెలిసిందే. కొత్త జిల్లాల ఏర్పాటులో ఏపీ స‌ర్కారు ముంద‌డుగు వేసింది. కొత్త జిల్లాల ఏర్పాటు ప్ర‌తిపాద‌న‌పై ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. మంగ‌ళ‌వారం రాత్రి ఆన్ లైన్ లో స‌మావేశం అయిన ఏపీ కేబినెట్ జిల్లాల విభ‌జ‌న‌కు ఆమోదం తెలిపింది. ఆన్ లైన్ లోనే మంత్రులు త‌మ ఆమోదాన్ని తెలిపారు.

దీంతో జిల్లాల విభ‌జ‌న ప్ర‌క్రియ కాస్త ముందుకు జ‌రిగింది. లోక్ స‌భ నియోజ‌క వ‌ర్గం ఆధారంగా జిల్లాలను చేయాల‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం భావిస్తుంది. అయితే అరుకు లోక్ స‌భ నియోజక వ‌ర్గం విస్తిర్ణం ప‌రంగా పెద్ద‌గా ఉంటుంది. దీంతో అరుకు ను రెండు జిల్లాలుగా విభ‌జించే అవ‌కాశం ఉంది. కాగ ఆంధ్ర ప్ర‌దేశ్ లో కొత్త జిల్లాలు ఇలా ఉండ‌నున్నాయి.

శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, తూర్పు గోదావ‌రి (కాకినాడ), పశ్చిమ గోదావ‌రి (ఏలూరు), రాజమండ్రి , కోనసీమ (అమలాపురం), నరసాపురం (భీమవరం), మన్యం (పార్వతీపురం), అల్లూరి సీతారామరాజు (పాడేరు), ఎన్టీఆర్ (విజయవాడ) , కృష్ణా (మచిలీపట్నం), పల్నాడు (నరసరావుపేట) , బాపట్ల, ప్రకాశం (ఒంగోలు), శ్రీ బాలాజీ (తిరుపతి), చిత్తూరు, అన్నమయ్య (రాయచోటి), సత్యసాయి (పుట్టపర్తి), అనంతపురం, కడప, కర్నూలు, నంద్యాల, గుంటూరు, నెల్లూరు ,