రాజమండ్రి సెంట్రల్ జైలులో రెండవ రోజు సీఐడీ విచారణ ప్రారంభమైంది. టీడీపీ అధినేత చంద్రబాబును విచారిస్తున్నారు సీఐడీ అధికారుల బృందం. చంద్రబాబుకు వైద్య పరీక్షలు చేసిన అనంతరం రెండవ రోజు సీఐడీ విచారణ ప్రారంభమైంది. ఈ తరుణంలోనే…రాజమండ్రి సెంట్రల్ జైలుకి చంద్రబాబు తరుపు న్యాయవాదులు లక్ష్మీనారాయణ, శ్రీనివాస్ రావు చేరుకున్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబు విచారణ సమయంలో చంద్రబాబుకు 10 మీటర్ల దూరంలో ఉండనున్నారు అడ్వకేట్లు లక్ష్మీనారాయణ, శ్రీనివాస్ రావు. కాసేపటి క్రితమే ప్రారంభం అయిన చంద్రబాబు సిఐడి రెండో రోజు విచారణ….కోర్టు ఇచ్చిన నిబంధనల ప్రకారం 9:30కు ప్రారంభం అయింది. కాగా, చంద్రబాబు అరెస్టుకు నిరసనగా ఐటీ ప్రొఫెషనల్స్… హైదరాబాద్ నుంచి ఏపీకి వస్తోన్నారు. ఈ సందర్భంగా రాజమండ్రి సెంట్రల్ జైలు వద్దకెళ్లి చంద్రబాబుకు సంఘీభావం తెలపనున్నారు ఐటీ ప్రొఫెషనల్స్. అయితే.. ఐటి ఉద్యోగుల ఛలో రాజమండ్రి సెంట్రల్ జైలు నేపధ్యంలో భద్రత కట్టుదిట్టం చేశారు ఏపీ పోలీసులు.