ఉండవల్లి అరుణ్ కుమార్ కు రఘురామ కౌంటర్‌..!

-

జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ అవినీతిపై సీబీఐ విచారణ కోరుతూ సమాజంలో గౌరవం ఉన్న పార్లమెంట్ మాజీ సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు హైకోర్టులో పిల్ దాఖలు చేయాలని రఘురామకృష్ణ రాజు గారు సూచించారు. స్కిల్ డెవలప్మెంట్ స్కీములో 370 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని, ఈ అవినీతిపై సీబీఐ విచారణ జరిపించాలని కోరుతూ రాజకీయాలలో అవినీతి మరకలు అంటని ఉండవల్లి అరుణ్ కుమార్ గారు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారని, సీఐడికి ఏమీ తెలియదని ఉండవల్లి అరుణ్ కుమార్ గారు గుడ్డలు ఊడదీసిన తీరు అద్భుతం అని అన్నారు.

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో కొనసాగే సీఐడీ కంటే, సీబీఐ అయితే విచారణ నిష్పక్షపాతంగా జరుగుతుందని భావించి హైకోర్టులో ఆయన పిటిషన్ దాఖలు చేశారని, అయితే ఉండవల్లి అరుణ్ కుమార్ గారి ఉద్దేశాన్ని అర్థం చేసుకోవడంలో ప్రతిపక్ష పార్టీల సానుభూతిపరులు విఫలమయ్యారని అన్నారు. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ఖజానాకు గండి పడితే, తన గుండెకు చిల్లు పడినట్లుగా భావించి అవినీతి నిగ్గు తేల్చాలని హైకోర్టులో పిల్ వేసినట్లుగానే, జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో ఇసుక, మట్టి, మద్యం వ్యాపారాలలో అవినీతిపై కూడా పిల్ దాఖలు చేయాలని ఆయనను కోరారు.

జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ల్యాండ్, శ్యాండ్, మైన్లలో అవినీతి జరుగుతోందంటూ గతంలో పేర్కొన్న ఉండవల్లి అరుణ్ కుమార్ గారు అదే అవినీతిపై సీబీఐ విచారణను కోరాలని, సీమెన్స్ ప్రస్తుత డైరెక్టర్ ఈడీ కేసుల్లో ఒక అఫిడవిట్ ఇచ్చారని, ఆ అఫిడవిట్లో స్కిల్ డెవలప్మెంట్ స్కీం అమలుకు 95 నుంచి 98% ఇన్ కైండ్ ఇచ్చామని పేర్కొన్నారని, అయినా అసెంబ్లీ సాక్షిగా మా పార్టీ నాయకులు పచ్చి అబద్ధాలు చెబుతున్నారని, ఒక అబద్ధాన్ని పదిసార్లు చెబితే నిజమైపోతుంది అన్నట్లుగా… సూర్యుడు మీద ఉమ్మి వేసే ప్రయత్నాన్ని చేస్తున్నారని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news