ఏపీలో ఘోర ప్రమాదం..రెండు లారీ ఢీ..డ్రైవర్ , క్లీనర్ మృతి !

-

ఏపీలో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం జాతీయ రహదారిపై గౌతమి కొత్త వంతెన వద్ద అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మరమ్మత్తు కోసం ఆగి ఉన్న మార్కెట్ లారీని వెనుక నుంచి వచ్చిన మరో టిప్పర్ లారీ ఢీ కొట్టింది.

ప్రమాదంలో మరమ్మతులు చేస్తున్న లారీ డ్రైవర్ , క్లీనర్ ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో లారీ డ్రైవర్ , క్లీనర్ ఇద్దరికి తీవ్ర గాయాలు పరిస్థితి విషమంగా ఉంది. టిప్పర్ లారీ క్యాబిన్ లో ఇరుక్కుపోయిన డైవర్ క్లీనర్లు కాపాడండి అంటూ ఆర్తనాదాలు వినిపించినట్లు స్థానికులు చెబుతున్నారు. గంటసేపు శ్రమించి క్రెయిన్ సహాయంతో వారిని బయటకు తీపింది పోలీసులు హైవే సిబ్బంది. అనంతరం అంబులెన్స్ లో రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంతో ట్రాఫిక్ జాతీయ రహదారిపై భారీగా నిలిచిపోయింది.

Read more RELATED
Recommended to you

Latest news