పెద్దిరెడ్డిపై ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం తిరగబడ్డాడు – రఘురామ

-

వైకాపా నాయకత్వంపై చిత్తూరు జిల్లా సత్యవేడు రిజర్వు నియోజకవర్గ శాసన సభ్యుడైన కోనేటి ఆదిమూలం వైకాపా నాయకత్వంపై తిరగబడ్డారని రఘురామకృష్ణ రాజు తెలిపారు. వైకాపా ప్రభుత్వంలో నెంబర్ 2 గా పేరుపొందిన పెద్దిరెడ్డిపైనే ఆయన దిక్కారస్వరాన్ని వినిపించారని, తన నియోజకవర్గంతో పెద్దిరెడ్డి గారికి సంబంధం ఏమిటి అని ప్రశ్నించారని, అన్ని మైన్లను కొట్టేసేది మీరైతే, చెడ్డపేరు మాకా అంటూ ప్రశ్నించారన్నారు.

వైకాపా శాసనసభ్యులు కొంత మంది తొలుత ధిక్కారస్వరాన్ని వినిపించి, ఆ తరువాత మీడియా వక్రీకరించిందని చెప్పడం పరిపాటి అని, ఆదిమూలం అలా భయపడే వ్యక్తి కాదని అనుకుంటున్నానని అన్నారు. రేపు సాక్షి దినపత్రిక చూస్తే కానీ ఆదిమూలం గారి స్టాండ్ ఏమిటన్నది తెలియదని అన్నారు. ఆంధ్రజ్యోతి దినపత్రిక రాసిన వార్త ఎప్పుడు తప్పు కాదు.. ఎందుకంటే వారికి అటువంటి నెట్వర్క్ ఉంది అని అన్నారు. ముఖ్యమంత్రి గారి ఇంట్లోకి చనువుగా వెళ్లే కడప జిల్లాకు చెందిన ఒక ఎమ్మెల్యేను ఉద్దేశించి ఆయన సర్వే ఫలితాలు మీకు సానుకూలంగా రాలేదని పేర్కొనగా, నా సర్వే రిపోర్టు బాగా లేదంటే, నీ సర్వే రిపోర్టు ఎలా బాగుంటుందని ప్రశ్నించడమే కాకుండా, నేను ఏమైనా హత్య చేయించానా? అని ప్రశ్నించినట్లు తెలిసిందని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news