ఆంధ్రప్రదేశ్ లో లిక్కర్ స్కామ్ కేసు లో కీలక మలుపు చోటు చేసుకుంది. ఏ-40గా ఉన్న వరుణ్ ఇచ్చిన సమాచారంతో ఇవాళ సిట్ అధికారులు హైదరాబాద్ లో పలు చోట్ల దాడులు చేశారు. ఈ మేరకు 12 అట్టపెట్టేల్లో డంప్ చేసిన రూ.11కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. శంషాబాద్ కాచారంలో ఉన్న సులోచన ఫామ్ హౌస్ లో ఈ నగదును సీజ్ చేశారు. రాజ్ కసిరెడ్డి సూచనల మేరకు ఈ డబ్బును అక్కడ దాచిపెట్టినట్టు మరో నిందితుడు వరుణ్ పురుషోత్తం ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా సోదాలు చేశారు. ఈ కేసులో వరుణ్ ఏ-40గా ఉన్నారు.
ఈ కేసులో ఏ1 గా ఉన్న రాజ్ కసిరెడ్డి ఆదేశాలతో వరుణ్, చాణక్య 12 పెట్టెల్లో రూ.11 కోట్లు దాచిపెట్టినట్టు అంగీకరించారు. 2024 జూన్ లో ఈ మొత్తం దాచిపెట్టినట్టు తెలిపారు. శంషాబాద్ మండలంలో కాచారం లోని సులోచన ఫామ్ హౌస్ లో సిట్ అధికారులు తాజాగా దాడులు చేసి రూ.11 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ గెస్ట్ మౌస్ సులోచన ఫా:హౌస్.. ప్రొఫెసర్ తీగల బాల్ రెడ్డి పేరు మీద ఉన్నట్టు సిట్ అధికారులు గుర్తించారు.