ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యార్థులకు బిగ్ అలెర్ట్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇవాళ పాఠశాలల బంద్ నకు ఏబీవీపీ పిలుపునిచ్చింది. ప్రైవేటు మరియు కార్పొరేట్ విద్యాసంస్థల యాజమాన్యాలు అధిక ఫీజులతో తల్లిదండ్రులను నిలువునా ముంచేస్తున్నాయని ఏబీవీపీ ఆరోపణలు చేస్తోంది.
ఇక ఏపీ ప్రవేట్ స్కూల్లోని ఫీజుల దోపిడీకి వ్యతిరేకంగా బంధు నిర్వహిస్తున్నట్లు ఏబీవీపీ ప్రకటన చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులను డీఎస్సీ ద్వారా తక్షణమే భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్నామని ఈ సందర్భంగా పేర్కొంది ఏబీవీపీ. అలాగే పాఠశాలల బందు ను అందరూ విజయవంతం చేయాలని కోరింది ఏబీవీపీ.