విడాకులు ప్రకటించేసిన నిహారిక – చైతన్య.. షాక్ లో మెగా ఫాన్స్..!

-

మెగా ఫ్యామిలీ లో అమ్మాయిలకు పెళ్లిళ్లు కలిసి రావడం లేదు అని ఇప్పుడు నిహారిక విడాకులతో స్పష్టమవుతుందని చెప్పవచ్చు. గత కొద్ది రోజులుగా నిహారిక తన భర్త చైతన్య జొన్నలగడ్డ నుంచి దూరంగా ఉంటుంది అంటూ వార్తలు జోరుగా వినిపించిన విషయం తెలిసిందే.. అందుకు తగ్గట్టుగా ఇన్స్టాగ్రామ్ లో ఒకరి ఫోటోలను ఒకరు డిలీట్ చేసుకోవడం, పెళ్లి ఫోటోలను కూడా డిలీట్ చేయడంతో ఇక ఇద్దరు విడాకులు తీసుకోబోతున్నారు అంటూ వార్తలు బాగా వినిపించాయి. మరొకవైపు నిహారిక ప్రతి విషయాన్ని హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటూ సింగిల్గానే పోస్ట్లు పెడుతోంది. కానీ తన భర్తకు సంబంధించిన ఒక ఫోటోను కూడా ఆమె షేర్ చేయలేదు.

అంతేకాదు మెగా ఫ్యామిలీలో జరిగే ప్రతి చిన్న ఫంక్షన్ కి కూడా ఆమె ఒక్కటే హాజరవుతూ ఉంది. ఇక ఆమె భర్త చైతన్య ఇప్పటివరకు తనతో కలిసి కనిపించిన దాఖలాలు లేవు.. పైగా ఆయన ఇటీవల ఇతర రాష్ట్రాలలో యోగాశ్రమంలో చేరి అక్కడే తనకు కొత్త జీవితాన్ని మొదలైంది అన్నట్టుగా ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ పెడుతూ మరింత హాట్ టాపిక్ గా మారుతున్నారు. దీంతో వీరిద్దరూ నిజంగానే విడిపోయారు అన్న వార్తలు వినిపిస్తున్నా.. అధికారికంగా వీరిద్దరి విడాకులు తీసుకున్నట్లు ఎక్కడ రుజువు లేదు. కానీ ఇప్పుడు ఎట్టకేలకు వీరిద్దరూ విడాకులు తీసుకున్నారని ఒక అధికారిక ప్రకటన సోషల్ మీడియాలో మరింత హాట్ టాపిక్ గా మారింది.

హైదరాబాదులోని జూబ్లీహిల్స్ ఏరియాలో ఉన్న ఫ్యామిలీ కోర్టు వీరిద్దరికీ నెలకి రోజుల క్రితమే విడాకులు మంజూరు చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన విషయాలు కూడా అధికారికంగా నెట్టింట వైరల్ అవుతూ ఉండడం గమనార్హం. ఏది ఏమైనా ఈ విషయం తెలిసి మెగా అభిమానులు ఆశ్చర్యపోతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version