ఏపీ మాజీ మైన్స్ డెరైక్టర్ వెంకటరెడ్డి పై ఏసీబీ కేసు నమోదు..!

-

ఏపీ మాజీ మైన్స్ డెరైక్టర్ వెంకటరెడ్డి పై ఏసీబీ కేసు నమోదు చేసింది. నిబంధనలకు విరుద్ధంగా 120 కోట్ల మేర అక్రమాలకు పాల్పడినట్టు గుర్తించిన ఏసీబీ.. డీజీ ఆదేశాల మేరకు ఇవాళ తనిఖీలు చేపట్టినట్టు వెల్లడించింది. మైన్స్, జియాలజీ టెండర్లు, ఒప్పందాలు, ngt నిబంధనలు, ఇసుక మైనింగ్ కార్యకలాపాల్లో నిబంధనల ఉల్లంఘన చేసినట్టు నివేదిక సమర్పించారు. ప్రభుత్వ అనుమతితో ప్రాథమిక విచారణ చెప్పటింది. అలాగే తన అధికారాన్ని వెంకటరెడ్డి దుర్వినియోగం చేసినట్టు ప్రాథమిక గుర్తించారు.

MTMG ప్రాజెక్ట్, ప్రతిమ ఇన్ఫ్రా వంటి వారికి మితిమీరిన ప్రయోజనం చేకూర్చినట్టు.. కుట్రపూరితంగా బ్యాంకు హామీలు 120 కోట్లు నిబంధనలకు విరుద్ధంగా ఉల్లంఘించి నట్టు ప్రైవేట్ వ్యక్తులకు లబ్ధి చేకూర్చినట్లు అలాగే.. ప్రభుత్వ ఖజానాకు రావాల్సిన ఆదాయం JPVL, GCKC కంపెనీలకు లబ్ధి చేకూర్చినట్టు గుర్తించారు. ఇందువల్ల 2566 కోట్ల మేర ప్రభుత్వ ఆదాయానికి గండి పడింది. DLSC నివేదికలులో సరిహద్దులు దాటి తవ్వకాలు చేయటం పర్యావరణ నిబంధనలకు విరుద్ధంగా భారీ యంత్రాలతో తవ్వకాలు జరిపినట్టు గుర్తించారు. ఇవాళ GCKC కార్యాలయం, ప్రతిమ ఇన్ఫ్ర, వెంకటరెడ్డి విజయవాడ నివాసంలో సోదాలు కొనసాగిస్తున్న ఏసీబీ.. వెంకటరెడ్డిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టింది.

Read more RELATED
Recommended to you

Latest news