ఏపీలో CTU ప్రారంభించాలని సీఎస్ నీరబ్ కుమార్ ఆదేశాలు..!

-

ఈనెల17 నుండి అక్టోబరు 2వ తేదీ వరకూ రాష్ట్ర వ్యాప్తంగా స్వచ్ఛతా హి సేవా కార్యక్రమాన్ని విజయవతంగా నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ అధికారులను ఆదేశించారు. స్వచ్ఛతా హి సేవా కార్యక్రమానికి సంబంధించి గురువారం రాష్ట్ర సచివాలయంలో వివిధ లైన్ డిపార్ట్‌మెంట్ల కార్యదర్శులతో రాష్ట్ర స్థాయి తొలి స్టీరింగ్ కమిటీ సమావేశం,జిల్లా కలెక్టర్లతో వీడియో సమావేశం నిర్వహించారు.ఈసందర్భంగా సీఎస్ మాట్లాడుతూ ఈ పరిశుభ్రత ప్రచార కార్యక్రమం ఈనెల 17న ప్రారంభమై పక్షం రోజుల పాటు అనగా గాందీ జయంతి అక్టోబరు 2వరకూ నిర్వహించాలని చెప్పారు.ఇందుకు సంబంధించి సన్నాహక కార్యక్రమం ఈనెల14 నుండి ప్రారంభమవుతుందన్నారు.

స్వచ్ఛతా హి సేవా ప్రచారం వివిధ కార్యక్రమాల ద్వారా లక్షలాది మంది పౌరులను సమీకరించడానికి రూపొందించ బడిందని ఈప్రచారం ప్రవర్తనలో భాగంగా స్వచ్ఛతను ప్రోత్సహించడం పై ప్రజల్లో అవగాహన కలిగించాలని సిఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ చెప్పారు.రాబోయే స్వచ్ఛతా హి సేవ ప్రచారం 2024 కోసం సన్నాహకాలపై సిఎస్ అధికారులకు దిశానిర్దేసం చేశారు.రాష్ట్రవ్యాప్తంగా పరిశుభ్రత అగగాహన కార్యక్రమాలను ఈ నెల 17న నుండి ప్రారంభించి పక్షం రోజుల పాటు నిర్వహించాలన్నారు. 17 సెప్టెంబర్ నుండి అన్ని జిల్లాలు,పట్టణ స్థానిక సంస్థలు క్లీన్లీనెస్ టార్గెట్ యూనిట్ల (CTUలు) పరివర్తనను ప్రారంభించాలని సిఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ పేర్కొన్నారు.పట్టణ మరియు గ్రామీణ ప్రాంతాల కేంద్రాల్లోను సామూహిక పరిశుభ్రత డ్రైవ్‌లను నిర్వహించాలని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news