వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తను వదిలేసిన కడప ఎస్పీ పై చర్యలు తీసుకున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్, అనితలపై ట్రోల్స్ చేసినందుకు వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్ర రవీందర్ రెడ్డిని అరెస్ట్ చేశారు. అయితే అతనికి 41సి నోటీసులు ఇచ్చి మాత్రమే వదిలేసారు కడప పోలీసులు. వర్ర రవీందర్ రెడ్డిని వదిలేయడంపై సీరియస్ అయ్యారు సీఎం చంద్రబాబు నాయుడు, డీజీపీ ద్వారకా తిరుమలరావు. కడప ఎస్పీ హర్షవర్ధన్ రాజు తాజాగా బదిలీ అయ్యారు. అలాగే సర్కిల్ ఇన్స్‌పెక్టర్‌ను సస్పెండ్ చేశారు డీజీపీ.
వర్ర రవీందర్ రెడ్డిని వదిలేయడం పట్ల కడప ఎస్పీ హర్ష వర్దన్ రాజు పై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇటీవలే పవన్ కళ్యాణ్ రాష్ట్ర పోలీసులపై, హోంమంత్రి పై సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యల పట్ల పోలీసులకు ఇవాళ సచివాలయంలో వార్నింగ్ ఇచ్చారు సీఎం చంద్రబాబు. సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసే వారిని అస్సలు వదిలిపెట్టవద్దని సూచించారు చంద్రబాబు.