వీడియో.. ప్ర‌గ‌తి డ్యాన్స్ కిర్రాక్ సీటీమారే!

-

పాపుల‌ర్ క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ ప్ర‌గ‌తి ఈ మ‌ధ్య సోష‌ల్ మీడియాలో ర‌చ్చ చేస్తోంది. లాక్‌డౌన్ టైమ్‌లో వారినికో యోగా వీడియోని వ‌దులుతూ హ‌ల్‌చ‌ల్ చేసిన ప్ర‌గ‌తి ఆ మ‌ధ్య లుంగీ డ్యాన్స్ తో చేసిన ర‌చ్చ అంతా ఇంతా కాదు. షార్ట్‌, పైన హాఫ్ ష‌ర్ట్ ధ‌రించి ప్ర‌గ‌తి ఓ త‌మిళ పాట‌కు వేసిన మాస్‌ స్టెప్స్ దుమ్ములేపాయి. ఏంటీ ప్ర‌గ‌తి ఈ రేంజ్‌లో డ్యాన్స్ ఇర‌గ‌దీస్తుందా? అని అంతా ముక్కున వేలేసుకున్నారు.

తాజాగా మ‌రోసారి అలాంటి వీడియోనే షేర్ చేసింది ప్ర‌గ‌తి. షూటింగ్‌లు చిన్న చిన్న‌గా స్టార్ట్ అవుతుండ‌టంతో ఫిట్ నెస్ కోసం జిమ్‌కి వెళుతూ వ‌ర్క‌వుట్‌లు , యోగా చేస్తోంది. ఇటీవ‌ల ఓ జిమ్‌కి వెళ్లిన ప్ర‌గ‌తి అక్క‌డ ఓ హిందీ ఫాట్ బీట్‌కి అదిరిపోయే స్టెప్పులేసింది. పాట‌ని హ‌మ్ చేస్తూ ల‌య బ‌ద్ధంగా మాస్ మూవ్‌మెంట్స్‌తో ప్ర‌గ‌టి ర‌చ్చ చేసింది. దీనికి సంబంధించిన వీడియోని ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. దీంతో ఈ వీడియో ఓ రేంజ్‌లో వైర‌ల్ గా మారింది. ఆమె డ్యాన్స్ చూసిన వారంతా సీటీమార్ పాట‌కు త‌గ్గ‌ట్టే కిర్రాక్‌గా వుంద‌ని విజిల్స్ వేస్తున్నారు.

 

View this post on Instagram

 

Never explain if it makes you happy… 🤩🤪

A post shared by Pragathi Mahavadi (@pragstrong) on

Read more RELATED
Recommended to you

Latest news