బీజేపీలో చేరిన విశాఖ డెయిరీ అధినేత ఆడారి ఆనంద్ !

-

విశాఖ డెయిరీ అధినేత ఆడారి ఆనంద్ బిజెపి లో చేరారు. ఈ సందర్భంగా రాజమండ్రి ఎంపీ పురంధేశ్వరి…విశాఖ డెయిరీ అధినేత ఆడారి ఆనంద్ కు కండువా కప్పి పార్టీ లోకి ఆహ్వానించారు. ఈ సందర్బంగా రాజమండ్రి ఎంపీ పురంధేశ్వరి మాట్లాడుతూ…. సాదరంగా పార్టీలోకి ఆహ్వానిస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను….వారి తండ్రి తో మా నాన్న కు అవినాభావ సంబంధం ఉందని తెలిపారు.

Adari Anand, head of Visakha Dairy joined BJP

పార్టీలోకి వచ్చిన తరువాత సిద్ధాంతం, క్రమశిక్షణ అవలంబిస్తూ వారి ప్రాంతంలో పార్టీని బలోపేతం చెయ్యడానికి కృషి చేయ్యాలని పేర్కొన్నారు. ప్రధాని మోదీ అవినీతి రహిత పాలన అందిస్తున్నారు, అలాగే దృఢ నిర్ణయాలు తీసుకోవడంలో దిట్ట అన్నారు. 2029 ఎన్నికల్లో కూడా బిజెపి నీ ప్రజలు ఆశీర్వదిస్తారు….11 వ ఆర్థిక శక్తి గా ఉన్న దేశాన్ని 5 వ ఆర్థిక శక్తిగా ప్రధాని మోదీ తీర్చిదిద్దారని వెల్లడించారు. అమిత్ షా… అంబేద్కర్ ను అవమానించారు అని కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తున్నారని ఫైర్‌ అయ్యారు. కాంగ్రెస్ నాయకులు అంబేద్కర్ కు భారత్ రత్న ఎందుకు ఇవ్వలేదు అని ప్రశ్నిస్తున్న….దేశ ప్రధానిగా ఎదగడానికి కారణం అంబేద్కర్ అని మోదీ అన్నారన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news