రైతుల ఆదాయాన్ని పెంచే దిశగా తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం..!

-

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఆదాయాన్ని పెంచే దిశగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. “పంట సాగుతో పాటు సౌర విద్యుత్ ఉత్పత్తిని అనుసంధానించేందుకు వినూత్న కార్యక్రమాన్ని అమలు చేయనుంది. ప్రధాన మంత్రి కిసాన్ ఊర్జా సురక్ష ఏవం ఉత్థాన్ మహాభియాన్ పథకంలో భాగంగా.. రాష్ట్రంలోని రైతులకు తమ వ్యవసాయ భూములలో సోలార్ పవర్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకునే అవకాశం కల్పిస్తోంది” అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క  వెల్లడించారు.

రైతుల పొలాలలో సోలార్ విద్యుత్ ఉత్పత్తి ద్వారా వారికి అదనపు ఆదాయాన్ని అందించడమే ప్రధాన లక్ష్యంగా ఈ పథకాన్ని రూపొందించారు. పాడుబడిన లేదా సాగుకు అనుకూలం కానీ భూముల్లో సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేసి.. రైతులు తమ భూమిని లీజుకు ఇవ్వడం ద్వారా నష్టాలను ఆదాయ మార్గాలుగా మార్చుకునే అవకాశం పొందుతారని తెలిపారు. TGREDCO  వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. వీటికి రైతులు, సహకార సంఘాలు, పంచాయతీ, ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ , వాటర్ యూజర్ అసోసియేషన్ లు  ఈ పథకంలో భాగస్వాములు కావడానికి అర్హులు అని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news