పోలవరం ప్రాజెక్టును రాజీవ్ ప్రతాప్ రూడీ నేతృత్వంలోని 30 మంది పార్లమెంటరీ కమిటీ సభ్యుల బృందం తాజాగా సందర్శించింది. వారితో పాటు రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు కూడా ఉన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టును వైసీపీ సర్కార్ 20 ఏళ్లు వెనక్కి నెట్టిందని మంత్రి నిమ్మల రామానాయుడు ఆరోపించారు. ఏడాదిన్నర కష్టపడి డయా ఫ్రమ్ వాల్ నిర్మిస్తే.. వైసీపీ దానిని ధ్వంసం చేసిందని మండిపడ్డారు.
పోలవరం ప్రాజెక్టు సందర్శనకు వచ్చిన పార్లమెంటరీ కమిటీకి ఆయన స్వాగతం పలికారు. 2014-19 మధ్య పోలవరం ప్రాజెక్టు 72 శాతం పనులు పూర్తి చేశామన్నారు. సీఎం ఇచ్చిన షెడ్యూల్ ప్రకారమే 2027 సెప్టెంబర్ వరకు పోలవరాన్ని పూర్తి చేస్తామని స్పష్టం చేసారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో 18 నెలలు కష్టపడి డయాఫ్రమ్ వాల్ ను నిర్మిస్తే దాన్ని వైసీపీ ప్రభుత్వం ధ్వంసం చేసిందని నిమ్మల మండిపడ్డారు. సీఎం చంద్రబాబు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం ఈ నెలలో డయాఫ్రమ్ వాల్ కాంక్రీట్ పనులు మొదలుపెడతామన్నారు.