ఏపీ రైతులకు మరో శుభవార్త చెప్పారు ఏపీ వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు. మండలిలో వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ… వచ్చే ఏడాది రైతులకు ప్రభుత్వం మంచి ఇన్స్యూరెన్స్ పథకం అమలు చేస్తామని ప్రకటన చేశారు. ఈ ఏడాది వరకు పాత విధానంలో మాత్రమే ఇన్స్యూరెన్స్ అమలు చేస్తామని హామీ ఇచ్చారు. కేంద్రం సాయంతో వచ్చే ఏడాది మంచి ఇన్స్యూరెన్స్ పథకం అమలు చేసి రైతులకు మరింత మేలు చేస్తామన్నారు ఏపీ వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు.
దీనివల్ల ఖరీఫ్, రబీ సమయంలో కూడా రైతులు నష్టపోకుండా ఇన్స్యూరెన్స్ అందేలా చేస్తామని వెల్లడించారు. బెస్ట్ ఇన్స్యూరెన్స్ పథకం వచ్చే ఏడాది నుంచి అమలు చేస్తామని తెలిపారు ఏపీ వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు. 2016 నుంచి 2019 వరకు అందిన విధంగా ఇన్స్యూరెన్స్ ప్రయోజన ఉంటుందన్నారు ఏపీ వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు. ఏపీ రైతులు ఆందోళన చెందాల్సిన పనిలేదని తెలిపారు ఏపీ వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు.