అగ్రిగోల్డ్ భూముల కొనుగోలు అక్రమాలపై ఇద్దరు అరెస్ట్..!

-

అగ్రిగోల్డ్ భూముల కొనుగోలు అక్రమాలపై ఇద్దరినీ అరెస్ట్ చేశాం అని ఏసీబీ అడిషనల్ ఎస్పీ సౌమ్యలత పేర్కొన్నారు. అలాగే ఈ అగ్రిగోల్డ్ భూముల అక్రమాల్లో జోగి రమేష్ పాత్ర ఉంటే కేసు నమోదు చేస్తాం. ఇప్పటికే విచారణ చేసి రిపోర్ట్ సిద్దం చేశాం రూరల్ మండల సర్వేయర్ రమేష్ ను కూడా అరెస్ట్ చేశాం అని తెలిపారు.

అంబాపురం సర్వే నంబర్ లో 86లో భూమి కొని దానిని 87లోకి మార్చి అమ్మేశారు. కానీ సర్వే నంబర్ 87లో అగ్రిగోల్డ్ భూములు ఉన్నాయి. అయితే అగ్రిగోల్డ్ భూములు అటాచ్ మెంట్ లో ఉన్న భూములను కొనుగోలు చేయడం నేరం. ఈ విషయంలో ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేసి అరెస్టులు చేశాం. మేము జరిపిన ప్రాథమిక విచారణలో అక్రమాలు జరిగినట్టుగా గుర్తించాం. ఏసీబీ నమోదు చేసిన కేసులో మాత్రం ఐదుగురు నిందితులుగా ఉన్నారు అని అడిషనల్ ఎస్పీ సౌమ్యలత తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version