ఏపీ ప్రజలకు అలర్ట్… నేటి భారీ నుంచి అతిభారీ వర్షాలు

-

ఏపీ ప్రజలకు అలర్ట్… నేటి భారీ నుంచి అతిభారీ వర్షాలు ఉన్నట్లు ఏపీ వాతావరణ శాఖ హెచ్చరించింది ఈ తరుణంలోనే ఏపీ ప్రజలు అంతా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ కోరింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేడు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఏపీ వాతావరణ శాఖ హెచ్చరించింది.

Alert for people of AP Heavy to very heavy rains today

అంతేకాదు.. ఏపీలోని అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్ష సూచనలు ఉన్నాయని స్పష్టం చేసింది ఏపీ వాతావరణ శాఖ. ముఖ్యంగా అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, ఉభయగోదావరి జిల్లాలు, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఏపీ వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇక అటు హైదరాబాద్ నగరంతో పాటు.. తెలంగాణ లోని పలు జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version