BREAKING: వల్లభనేని వంశీ అరెస్టుకు రంగం సిద్ధం!

-

All set to arrest Vallabhaneni Vamsi:  వైసీపీ పార్టీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి ఊహించని షాక్‌ తగిలింది. వైసీపీ పార్టీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టుకు రంగం సిద్ధం అయింది. కృష్ణా జిల్లా గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టుకు… పోలీసులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఏ క్షణమైనా వల్లభనేని వంశీ అరెస్టు అయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

All set to arrest Vallabhaneni Vamsi

గన్నవరంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం పై గతంలో దాడి జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ దాడి కేసులో వంశీని 71 వ నిందితుడిగా పోలీసులు గుర్తించడం జరిగింది. ఇప్పటివరకు ఈ కేసులో 18 మందిని అరెస్టు చేసి జైలుకు పంపించారు ఏపీ పోలీసులు.

అది కూడా చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ అరెస్టులు జరుగుతున్నాయి. తెలుగుదేశం పార్టీ కార్యాలయం పై దాడిలో వల్లభనేని వంశీ.. డైరెక్ట్ గా పాల్గొనలేదు. కానీ ఎమ్మెల్యే హోదాలో ఆయన ప్రోద్బలంతోనే.. తెలుగుదేశం పార్టీ కార్యాలయం పై… వైసిపి నేతలు దాడులు చేశారని పోలీసులు తేల్చారు. అందుకే 71 నిందితుడిగా వల్లబనేని వంశీని చేర్చారట.

Read more RELATED
Recommended to you

Latest news