ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోవడం జరుగుతుంది. అసలు వైసిపికి అనుకూలంగా ఎవరు పని చేసినా వారిపై చర్యలు తీసుకుంటుంది చంద్రబాబు ప్రభుత్వం. అయితే తాజాగా.. మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు రెండవ భార్య నందమూరి లక్ష్మీపార్వతి ఊహించని షాక్ ఇచ్చింది చంద్రబాబు ప్రభుత్వం.
ఆమెకు ఉన్న ట్యాగ్.. తొలిగించేసింది చంద్రబాబు కూటమి ప్రభుత్వం. తెలుగు అకాడమీ చైర్ పర్సన్ బాధ్యతలను లక్ష్మీపార్వతి నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే గతంలో కేటాయించిన ఆంధ్ర యూనివర్సిటీ గౌరవ ఆచార్యురాలు స్టేటస్ తీసేసినట్లు ఆంధ్ర యూనివర్సిటీ రిజిస్టర్ ఆచార్య కిషోర్ బాబు అధికారిక ప్రకటన చేయడం జరిగింది. గతంలో నందమూరి లక్ష్మీపార్వతి.. తెలుగు అకాడమీ చైర్ పర్సన్ గా బాధ్యతలు చేపట్టిన సమయంలో… వర్సిటీలో పరిశోధకులకు మార్గదర్శకాలు అందించే బాధ్యతను కూడా అప్పగించడం జరిగింది. అయితే తాజాగా లక్ష్మీపార్వతిని ఆ విధుల నుంచి కూడా అధికారులు తొలగించారు. దీంతో ఒకే సారికి లక్ష్మీపార్వతి కి రెండు దెబ్బలు తగిలాయి.