Telangana : బస్సుల్లో మహిళలకు ఫ్రీ.. నేటి నుంచి కొత్త రూల్స్

-

 

‘మహాలక్ష్మి-మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం’ పై TSRTC ఎండీ వీసీ సజ్జనర్ ప్రకటన చేశారు. ప్రతి ప్రయాణికురాలు విధిగా జీరో టికెట్ ను తీసుకుని సంస్థకు సహకరించాలని ఆయన కోరారు. ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన మహాలక్ష్మి-మహిళలకు ఉచిత బస్ ప్రయాణ సౌకర్యానికి మహిళ నుంచి మంచి స్పందన వస్తోందన్నారు TSRTC ఎండీ వీసీ సజ్జనర్.

Free RTC bus travel

ఎలాంటి ఫిర్యాదులు రాకుండా ప్రశాంతంగా ఈ పథకం అమలవుతోంది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్య పథకాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేసేందుకు సాప్ట్ వేర్ ను సంస్థ అప్ డేట్ చేసిందని వెల్లడించారు TSRTC ఎండీ వీసీ సజ్జనర్. ఆ సాప్ట్ వేర్ ను టిమ్ మెషిన్లలో ఇన్ స్టాల్ చేయడం జరుగుతోంది.

మెషిన్ల ద్వారా శుక్రవారం నుంచి జీరో టికెట్లను సంస్థ జారీ చేస్తుందన్నారు. మహిళా ప్రయాణికులకు తమ వెంట ఆధార్, ఓటరు, తదితర గుర్తింపు కార్డులను తెచ్చుకోవాలని కోరారు TSRTC ఎండీ వీసీ సజ్జనర్. స్థానికత ధృవీకరణ కోసం వాటిని కండక్టర్లకు చూపించి.. విధిగా జీరో టికెట్లను తీసుకోవాలని వెల్లడించారు. ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు అందుబాటులోకి తెచ్చిన ఈ పథకాన్ని.. మహిళలు, బాలికలు, విద్యార్థినులు, థర్డ్ జెండర్లు ఉపయోగించుకోవాలి.” అని టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్ సూచించారు.

Read more RELATED
Recommended to you

Latest news