తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేరు చెప్పలేదని అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేశారనడం సరికాదు అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. తాజాగా అమరావతిలో మీడియాతో చిట్ చాట్ లో ఆయన మాట్లాడారు. అల్లు అర్జున్ స్థానంలో రేవంత్ రెడ్డి ఉన్నా అలానే అరెస్ట్ చేస్తారు.. చట్టం ఎవరి చుట్టం కాదు అని తెలిపారు. అభిమాని మృతి చెందిన తర్వాత వెంటనే వాళ్ళ ఇంటికి వెళ్లి పరామర్శించాలి.
కానీ గోటితో పోయే దానిని గొడ్డలి దాకా తెచ్చుకున్నారు అని కామెంట్లు చేశారు మానవతా దృక్పథం లోపించనట్టు అయిందన్నారు. అల్లు అర్జున్ యే కాదు కనీసం టీమ్ అయినా సంతాపం చెప్పి ఉండాల్సింది అని విమర్శలు చేశారు. తన పేరు చెప్పలేదని రేవంత్.. అర్జున్ ను అరెస్టు చేశారని అనడం కూడా పెద్ద తప్పు అని, రేవంత్ ఆ స్థాయి దాటిన బలమైన నేత అని సీఎం రేవంత్ పై ప్రశంశలు కురిపించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.