చీరాలలో ఉప్పు.. నిప్పుల మధ్య అడ్జెస్ట్ అగత్యం..!

-

ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లా చీరాల వైసీపీలో నేతల మధ్య వైరాలు సర్దుకు పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అంతటి అగత్యం ప్రస్తుతమున్న పరిస్థితుల్లో ఒకే పార్టీలోని ఇరు వర్గాల మధ్య ఏర్పడింది. ఒకరు అధికార పార్టీకి మద్దతిచ్చిన ఎమ్మెల్యే అయితే… మరొకరు అధికార పార్టీలో ఉన్న మాజీ ఎమ్మెల్యే. వీరిద్దరి మధ్య ప్రధాన లక్ష్యం మాత్రం ఆ నియోజకవర్గంలో పెత్తనం కోసమే. ఈ విషయంలో ఆ ఇద్దరు నేతలూ గట్టిగానే పోటీపడుతున్నారు. మధ్యలో అధికారులు మాత్రం ఎటువైపు పలకాలో తెలియక అలా అలా సర్దుకుంటూ సాగతీసేస్తున్నారని టాక్ నడుస్తోంది.

 

ముఖ్యంగా చేనేత రంగానికి ప్రసిద్ధి చెందిన ప్రకాశం జిల్లా చీరాల ఇప్పుడు పొలిటికల్ వార్‌కి కేరాఫ్ అడ్రస్‌గా మారింది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అధికార పార్టీలో నేతల మధ్య నెలకొన్న వార్ ఆ పార్టీ నేతలకే తలబొప్పికట్టించేంతగా మారింది. కరణం వర్సెస్ ఆమంచిగా రాజకీయం మారడంతో రాజకీయాలు హాట్‌ టాపిక్‌గా మారాయి. భవిష్యత్తులో పెత్తనం నాదే అంటూ ఆమంతి.. ప్రస్తుతం తమ ఉనికిని కోల్పోకూడదని కరణం మధ్య తీవ్రమైన పోటీ ఏర్పడింది. నియోజకవర్గంలో ఎమ్మెల్యే కరణం బలరామ్‌, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌ ఇద్దరూ ముఖ్యమైన నేతలే. ఆ ఇద్దరిలో ఎవరినీ కాదనలేని..

కాదనరాని.. పరిస్థితి. గత ఎన్నికల్లో ఇదే నియోజక వర్గం నుంచి ప్రత్యర్థులుగా ఉన్న ఈ ఇద్దరు నాయకులు ఒకే ఫ్యాన్ కిందకు చేరారు. ఉప్పు.. నిప్పుగా ఉన్నవీరి మధ్య ఆధిపత్య పోరుకు తెరలేచింది. నాయకులు ఎవరికి వారు నియోజకవర్గంలో పెత్తనం చెలాయించేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఇలాంటి సమయంలో ప్రభుత్వం పెద్దలకు అటు యంత్రాంగాని.. వీరి మధ్య నెలకొన్ని వైరాలతో తలబొప్పి కడుతోందని టాక్ నడుస్తోంది. 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీపడ్డ ఆమంచి ఓడి.. టీడీపీ తరఫున కరణం గెలిచాడు. ఆమంచి ఓడినా సరే రాష్ట్రస్థాయి లీడర్ గా అధికారం కొనసాగిస్తున్నారు. దీంతో నియోజకవర్గంలో ఎలాంటి అధికారుల తతంగమైనా సరే తమ కనుసన్నల్లోంచే జరగాలన్నది ఆయన పట్టుబడుతున్నారు. కానీ…కరణం మాత్రం తమ ప్రాతినిధ్యం అవసరమని భీష్మించుకుంటున్నారు.

ఎమ్మెల్యేగా గెలిచినా.. చేతిలో అధికారం లేదని భావించిన కరణం.. ఎవరూ ఊహించని విధంగా సీఎం జగన్‌కు జై కొట్టారు. కుమారుడు వెంకటేష్‌కు దగ్గరుండి సీఎం జగన్‌తో కండువా కప్పించారు. ఆ విధంగా కరణం కూడా అధికార పార్టీ నాయకుడిగా చెలామణిలోకి వచ్చారు. అదీ అక్కడ నుంచి రాజుకుంది మళ్లీ కుంపటి రాజకీయం. చీరాలలో వైఎస్ జగన్ ని కరణం కలిసిన తర్వాత రాజకీయ మారిందని టాక్. ఆమంచికి పోటీగా కరణం కదపని పావులు.. వేయని ఎత్తుగడలు లేవని సమాచారం. నియోజకవర్గంలో ఆమంచి మాట వినిపించకుండా ఉండేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత పాలనలో తమ ముద్ర ఉండాలని జాగ్రత్త పడుతున్నారని సమాచారం. అసలు కరణం బలరాంకి వైసీపీ మంత్రి బాలినేని అండ దండిగా ఉంది. అందులో ఆయన వైసీపీలో కలిసేందుకు ప్రయత్నాలు జరిపారు.

అలా రాబోవు ఎన్నికల్లో కరణం కుమారుడికి అద్దంకి సీటు కేటాయించి.. ఆమంచికి ఇబ్బంది లేకుండా చీరాల సీటు ఖాయం చేద్దామని ఒప్పందం. కానీ.. ఉన్నఫలంగా చీరాలనంతా తమ అధీనంలోకి తెచ్చుకొనేందుకు కరణం తన మార్క్ రాజకీయం నడిపేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అందుకోసం అధికారుల బదిలీల విషయంలో కరణంకు, ఆమంచికి మధ్య తీవ్ర ఇబ్బందులు ఎదురౌతున్నాయని అధికారులే వాపోతున్నారు. ఓ రకంగా వీరి మధ్య అధికారులు నలిగిపోతున్నారని టాక్ నడుస్తోంది. తాజాగా కరణం.. బాలినేని అండతో తన మార్క్ రాజకీయం కోసం కొన్ని బదిలీలు చేయించుకున్నారని.. అది సుతరామూ ఆమంచికి నచ్చడం లేదని.. అధిష్టానం వద్దే తేల్చుకుంటానని చెప్తున్నట్లు సమాచారం. మరి వీరి మధ్య వైరం మళ్లీ అక్కడ ఆమంచి అధికారంలోకి వచ్చేంతవరకు తప్పదనే టాక్ కూడా నడుస్తోంది. చూడాలి ఏం జరుగుతుంది అనేది.

Read more RELATED
Recommended to you

Latest news