బెజవాడలో వరద తీవ్ర నష్టం మిగిల్చింది. 47 మంది ఇప్పటి వరకు మృతి చెందారు . మృతుల సంఖ్య వందల సంఖ్యకు చేరే అవకాశం ఉంది. ప్రభుత్వం సరైన సమయంలో స్పందించక పోవటం వల్ల ప్రమాద తీవ్రత పెరిగింది అని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. మొదటి ఫ్లోర్స్ లో ఉన్న వాళ్ళు కూడా మృతి చెందిన ఘటనలు బయటకు వస్తున్నాయి. ఈ విపత్తుకు చంద్రబాబు అసమర్ధత కారణం తప్ప జగన్ వల్ల కాదు. తుఫాన్ వస్తుందని అలెర్ట్ ప్రభుత్వానికి వచ్చింది. కానీ చంద్రబాబు ఇంట్లోకి నీరు వచ్చిన తర్వాత అందరూ మేల్కొన్నారు. అంతకు ముందు వరకు ఏ చర్యలు చేపట్టలేదు.
జగన్ హయంలో కూడా వరదలు వస్తె లంకలు మునిగాయి. వర్షాలు వరదలు వస్తె మొదట ప్రాథమికంగా చేయాల్సిన పనులు.. ప్రాజెక్టులు నిండు కుండలా ఉండి పైనుంచి నీరు వచ్చే అవకాశం ఉన్నప్పుడు చేయాల్సిన పనులు చేయలేదు. ఉమ్మడి రాష్ట్రానికి సీఎంగా పనిచేసిన చంద్రబాబు బఫర్ జోన్ లో ఉన్న ఇంట్లో ఉన్నారు. పక్కనే ఉన్న మంతెన సత్యనారాయణ ఆశ్రమంలోకి నీరు వచ్చింది. చంద్రబాబు ఇంట్లోకి నీరు రాలేదా.. అనుమతి లేని బఫర్ జోన్ లో ఉన్న ఇంట్లో చంద్రబాబు ఉంటున్నారు. ఈ ఇంట్లోకి కృష్ణా నీళ్లు వచ్చిన తర్వాత చంద్రబాబు వరద గుర్తు వచ్చింది. బఫర్ జోన్ లో ఉంది కాబట్టే ప్రజా వేదిక కూల్చాం. చంద్రబాబు ఇంటికి నోటీసు ఇస్తే ఆ ఇంటి యజమాని కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నారు అని అంబటి అన్నారు.