రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ విద్యాసంస్థలకు ఉచిత విద్యుత్ – డిప్యూటీ సీఎం భట్టి

-

తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కీలక ప్రకటన చేశారు. గురువారం ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ రవీంద్రభారతిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 41 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డుల ప్రధానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలోని మొత్తం 27,862 ప్రభుత్వ విద్యా సంస్థలకు ఉచితంగా విద్యుత్ సరఫరా చేస్తామని ప్రకటించారు.

తమ ప్రభుత్వం గురువులకు ఎంతో ప్రాధాన్యత ఇస్తుందన్నారు భట్టి విక్రమార్క. మన రాష్ట్ర విద్యా వ్యవస్థ ఇంకా మారాల్సి ఉందని.. విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంచేందుకు నైపుణ్య యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ విద్యాసంస్థలకు ఉచిత విద్యుత్ ని అందించే జీవోని కూడా విడుదల చేశామన్నారు.

ఈ జీవో ఈరోజు నుండే అమల్లోకి వస్తుందని తెలియజేశారు భట్టి. అనేక ప్రభుత్వ విద్యాసంస్థలు విద్యుత్ సదుపాయం లేక ఇబ్బందులు పడుతున్నట్లు చెప్పుకొచ్చారు. విద్యుత్ సదుపాయం ఉన్నప్పటికీ వాటి బిల్లులు సకాలంలో చెల్లించక విద్యుత్ కట్ చేస్తున్నారని తమ దృష్టికి వచ్చిందని.. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో వరదల సమస్యల వల్ల సీఎం రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమానికి హాజరు కాలేకపోయారని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version