పోలవరం ప్రాజెక్టుపై సోము వీర్రాజుకు అంబటి రాంబాబు కౌంటర్!

-

ఆంధ్రుల జీవనాడి పోలవరం ప్రాజెక్టు పై రాజకీయ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. కాపర్ డ్యాం పూర్తికాకుండానే డయాఫ్రం వాల్ నిర్మాణం చేపట్టారు అంటూ ఏపీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. దీనిపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు స్పందిస్తూ ఈ విషయం తెలుసుకోవడానికి మీకు మూడు సంవత్సరాలు పట్టిందా? అని ఎద్దేవా చేశారు. మీకు అనుకూలమైన కాంట్రాక్టర్లు ఉంటే చాలు, మీకు ముడుపులు అందితే చాలు.. అదే కదా టిడిపి, వైసిపి ఆలోచనా విధానం అని అన్నారు.

కేంద్ర మంత్రి షెకావత్ గారి పర్యటన తర్వాత ఈ తప్పులన్నీ బయటకు వస్తున్నాయి అని చెప్పారు. అయితే సోము వీర్రాజు వ్యాఖ్యలపై అంబటి రాంబాబు కూడా అదే స్థాయిలో సమాధానమిచ్చారు. తమ ప్రభుత్వమే కాదు, కేంద్ర జల శక్తి అడ్వైజర్ శ్రీరామ్ నాయకత్వంలో డయాఫ్రం వాల్ పరిశీలించి వెళ్లిన కేంద్ర కమిటీ కూడా పరిస్థితి నిర్ధారించలేకపోతుందని, ఈ విషయం కాస్త తెలుసుకోండి అని సెటైర్లు వేశారు .

Read more RELATED
Recommended to you

Exit mobile version