ఇవాళ ఉదయం నుంచి తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల వివాదం మరోసారి చెలరేగింది. దీంతో గురువారం తెల్లవారుజామున నాగార్జున సాగర్ డ్యాం దగ్గర ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఒక్కసారిగా 700 మంది ఏపీ పోలీసులు డ్యామ్ మీదికి చొరబడ్డారు. ఏపీ పోలీసులు నాగార్జునసాగర్ డ్యాం గేట్లు, సీసీ కెమెరాలు ధ్వంసం చేశారు.
విషయం తెలియడంతో హుటా హుటీనా అక్కడికి చేరుకున్నారు తెలంగాణ పోలీసులు. ఏపీ పోలీసులను అడ్డుకున్నారు. నాగార్జునసాగర్ నుంచి నీటిని విడుదల చేయడం లేదని గతంలోనూ ఏపీ పోలీసులు ఘర్షణకు దిగారు. దీంతో నాగార్జునసాగర్ పై తెలంగాణ, ఏపీ పోలీసుల మధ్య ఘర్షణ ఏర్పడింది. అయితే.. ఏపీ పోలీసులు నీటి విడుదలకు ప్రయత్నిస్తున్న క్రమంలో ఏపీ మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. ట్విట్టర్ వేదికగా అంబటి స్పందిస్తూ…. “త్రాగునీటి అవసరాల కోసం నాగార్జునసాగర్ రైట్ కెనాల్ కి నేడు నీరు విడుదల చేయనున్నాము అని పేర్కొన్నారు. అయితే, ఇప్పటికే ఉద్రిక్త పరిస్థితులు ఉన్న తరుణంలో మంత్రి కామెంట్స్ పరిస్థితులను దారుణంగా మార్చే విధంగా ఉన్నాయని పలువురు పేర్కొంటున్నారు.