చంద్రబాబు నటన ముందు పవన్ కళ్యాణ్ కూడా పనికిరాడు అని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. రఘురామకృష్ణం రాజును పోలీసులు టార్చర్ చేశారని కళ్ళతో చూసినట్లు శాసనసభలో చెప్పారు. కానీ గతంలో సుప్రీంకోర్టు కూడా టార్చర్ జరగలేదని చెప్పింది. ప్రజలను మోసం చేసి చంద్రబాబు అధికారంలోకి వచ్చారు. మీ మీద 420 కేసు ఎందుకు పెట్టకూడదు చెప్పమని మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అడిగారు. కూటమిలో 164 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు .. ఒక్కరైనా సమాధానం చెప్పగలరా అని ప్రశ్నించారు.
ఇక మా పార్టీ లో ఎంపీగా ఉండి రఘురాం కృష్ణంరాజు ఏం చేశారు. ప్రతిరోజు రచ్చబండని కార్యక్రమం పెట్టి వైయస్ జగన్ ను దూషించడమే పనిగా పెట్టుకున్నారు. వైయస్ జగన్ పై, రఘురామ కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యల పై చర్యలు తీసుకుంటే తప్పా. గతంలో టికెట్టు రానీ సందర్భంలో, నాకే టికెట్టు ఇవ్వని వాడు ఒక రాష్ట్రానికి ఏం పని చేస్తాడు అని రఘురామ కృష్ణంరాజు అన్నారు అని తెలిపిన అంబటి.. అధికారంలోకి రావడానికి చంద్రబాబు ఏ మోసానికైనా పాల్పడతారు అని పేర్కొన్నారు.