పవన్ కళ్యాణ్ కు లెక్కలేనంత తిక్క ఉంది : అంబటి రాంబాబు

-

కూటమి ప్రభుత్వం లో డిప్యూటీ సీఎం యం పవన్ కళ్యాణ్ అసమర్ధుడు. బియ్యం అక్రమ రవాణా అడ్డుకునే చిత్తశుద్ధి లేదు. బియ్యం అక్రమ రవాణా అడ్డుకోలేక పోయిన వ్యవహారంలో నాదెండ్ల మనోహర్ , పవన్ కళ్యాణ్ రాజీనామా చేయాలి అని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. పవన్ కళ్యాణ్ కు లెక్కలేనంత తిక్క ఉంది. దోపిడి తప్ప ఇంకేం పనిలేదు. ఎమ్మెల్యే కొండ బాబుకు మామూళ్ళు లేకుండానే ఇదంతా జరుగుతుందా. పవన్ కల్యాణ్ పెద్ద అసమర్థుడు అని అర్థం అవుతుంది.

పవన్ కళ్యాణ్ హీరోనా పిట్టల దొరా.. పవన్ కల్యాణ్ కాకినాడ వెళ్ళాడు. అంతకుముందే కలెక్టర్ షిప్ లో రవాణా అవుతున్న రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు. షిప్ సీజ్ చేశారు. పవన్ కళ్యాణ్, మరొక సిద్దాంత కర్త నాదెండ్ల మనోహర్ తో కలిసి వెళ్ళారు. కలెక్టర్ పట్టుకున్న బియ్యాన్ని మేము పట్టుకున్నామని పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు. పవన్ కళ్యాణ్ ప్రభుత్వంలో ఉండి పని చేస్తున్నారో లేదో అర్థం కావటం లేదు. ఎనభై శాతం రేషన్ బియ్యం అక్రమంగా రవాణా అవుతున్నాయి..ప్రతి నియోజకవర్గంలో బియ్యం అక్రమ రవాణా జరుగుతుంది. బియ్యం అక్రమ రవాణా ఎందుకు అడ్డుకోలేకపోతున్నారు.. బియ్యం అక్రమ రవాణాలో ఎమ్మెల్యేల పాత్ర ఉంది అని అంబటి రాంబాబు పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version