ఏపీ పర్యటనకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా రానున్నారు. నేడ రాత్రి 8:30కు గన్నవరం ఎయిర్ పోర్టుకి అమిత్ షా వస్తారు. ఇవాళ రాత్రి 9:10కి సీఎం చంద్రబాబు వద్దకు అమిత్ షా రానున్నారు. డిన్నర్ మీటింగ్ లో సీఎం, కేంద్ర హోంమంత్రి కలుస్తారు. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు వెలువడే అవకాశం ఉంది. ఇక ఇవాళ రాత్రికి విజయవాడ నోవాటెల్ లో అమిత్ షా బస చేస్తారు. రేపు గన్నవరం నియోజకవర్గం కొండపావులూరులో జరిగే NDRF 20వ వ్యవస్ధాపక దినోత్సవ వేడుకలకు అమిత్ షా హాజరు కానున్నారు.
ముందుగా NIDM క్యాంపస్ ను ప్రారంభించనున్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాకకు 700 మంది బిజెపి కార్యకర్తలు భారీ ఏర్పాటు చేస్తున్నారు. ఈ సమావేశ ప్రాంగణంలో 1200 మంది కూర్చునేలా సీటింగ్ ఏర్పాటు ఏర్పాటు చేశారు. దాదాపు రెండు గంటలపాటు జరగనుంది ఈ సమావేశం. ఈ సమావేశం అనంతరం ప్రత్యేక విమానంలో ఢిల్లీకి కేంద్ర హోంమంత్రి అమిత్ షా పయనం అవుతారు.
- అమరావతి
- ఇవాళ ఏపీకి కేంద్ర హోంమంత్రి అమిత్ షా
- రాత్రి 8:30కు గన్నవరం ఎయిర్ పోర్టుకి అమిత్ షా
- రాత్రి 9:10 నుంచీ 10:10 వరకూ సీఎం చంద్రబాబు తో డిన్నర్ సమావేశానికి అమిత్ షా
- అనంతరం రాత్రి 10:30కు నోవాటెల్ కు అమిత్ షా
- రాత్రి విజయవాడ నోవాటెల్ లో బస చేయనున్న అమిత్ షా