అనకాపల్లిలో విషాదం.. కుటుంబం ఆత్మహత్యాయత్నం.. నలుగురు మృతి

-

ఏపీలోని అనకాపల్లిలో విషాదం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్యకు యత్నించారు. వీరిలో నలుగురు మృతి చెందారు. ఆత్మహత్యకు యత్నించిన మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

పోలీసుల కథనం ప్రకారం.. “గుంటూరు జిల్లా తెనాలికి చెందిన స్వర్ణకారుడు శివరామకృష్ణ తన కుటుంబంతో కలిసి కొంతకాలంగా అనకాపల్లిలో నివసిస్తున్నారు. గురువారం రాత్రి వీరంతా సైనైడ్‌ తాగి ఆత్మహత్యకు యత్నించారు. వీరి బంధువులు, స్థానికులు సమాచారం ఇవ్వడంతో మేం ఘటనాస్థలికి చేరుకున్నాం. అప్పటికే నలుగురు మరణించారు. ఒకరు మాత్రం చావుబతుకుల మధ్య ఉండగా ఆస్పత్రిలో చేర్పించాం. మృతుల్లో శివరామకృష్ణ(40), మాధవి (38), కుమార్తెలు వైష్ణవి(16), లక్ష్మి(13) ఉన్నారు. అనకాపల్లి ప్రభుత్వాస్పత్రిలో మరో కుమార్తె కుసుమప్రియ(13) చికిత్స పొందుతోంది. అప్పుల బాధ తాళలేక వీరంతా బలవన్మరణానికి పాల్పడినట్లు స్థానికులు చెబుతున్నారు.” అని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని వీరి ఆత్మహత్యకు గల అసలు కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version