చంద్రబాబు ఆదేశిస్తే..ఎక్కడి నుంచైనా పోటీ చేస్తా – ఆనం కౌంటర్

-

చంద్రబాబు ఆదేశిస్తే..ఎక్కడి నుంచైనా పోటీ చేస్తానని అనిల్‌ కుమార్‌ యాదవ్‌ సవాల్‌ కు ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి కౌంటర్ ఇచ్చారు. టిడిపికి చెందిన ముగ్గురు శాసనసభ్యులను వైసీపీ వైపు తిప్పుకున్నారని.. ఆ ముగ్గురి చేత రాజీనామా చేయించారా అని ప్రశ్నించారు. అక్రమ సంపాదనకు వారిని అడ్డుపెట్టుకున్నారని ఫైర్‌ అయ్యారు. మేము ప్రతిపక్షంలో ఉన్నామని.. ఇంకా ఏడాది అధికారం ఉన్నా వద్దని బయటకు వచ్చామని తెలిపారు ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి.


మొదట ఆ ముగ్గురు టిడిపి ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించండి… తర్వాత మమ్మల్ని అడగండని విమర్శలు చేశారు. నేను గతంలో నెల్లూరు.. రాపూరు.. ఆత్మకూరు.. వెంకటగిరి ల నుంచి పోటీ చేశానని.. ఆరు సారు ఎమ్మెల్యేగా గెలిచా.. కొన్నిసార్లు ఓడిపోయానని గుర్తు చేశారు. చంద్రబాబు ఆదేశిస్తే ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేయమన్నా అందుకు సిద్ధంగా ఉన్నానని.. ఒకవేళ పది నియోజకవర్గాల గెలుపు బాధ్యతను అప్పగిస్తే ఆ పని చేస్తానని వెల్లడించారు ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news