ఖరీదైన కారు కొనుగోలు చేసిన మహేష్ బాబు.. ఎన్ని రూ .కోట్లంటే?

-

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోలలో ఒకరైన మహేష్ బాబు ప్రస్తుతం వరుస సినిమా ఆఫర్లతో బిజీగా దూసుకుపోతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఆయన నటిస్తున్న చిత్రం గుంటూరు కారం. ఈ సినిమాకు సంబంధించి స్క్రిప్ట్ విషయంలో నటీనటుల విషయంలో స్వల్పంగా మార్పులు చోటు చేసుకోవడం మనం చూస్తూనే ఉన్నాం. ఇక ఎలాగైనా సరే ఈ సినిమాను త్వరగా కంప్లీట్ చేసి రాజమౌళితో సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్నారు మహేష్ బాబు ఇదంతా పక్కన పెడితే తాజాగా మహేష్ బాబు ఒక ఖరీదైన కారును కొనుగోలు చేయగా.. అందుకు సంబంధించిన ఫోటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేశారు.

తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు గోల్డ్ కలర్ రేంజ్ రోవర్ కారును సొంతం చేసుకున్నారు. దీని ఖరీదు అక్షరాల 5.4 కోట్ల రూపాయలు. హైదరాబాదులో ఈ మోడల్ కారు ఇదే మొదటిదని.. సినీ ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఒక్కో సినిమాకు రూ .80 కోట్ల మేరా పారితోషకం తీసుకుంటున్న మహేష్ బాబు ఏకంగా ఈ కారు కోసం రూ.5 కోట్ల రూపాయల ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. అయితే అంత డబ్బు సంపాదించే ఆయన ఈ మొత్తంలో ఖర్చు చేయడం వింత ఏమీ కాదు అని.. కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.

ఇకపోతే ఈ కారుకు సంబంధించిన ఫోటోలను మహేష్ బాబు అభిమానులు తెగ వైరల్ చేస్తున్నారు. ఇక మహేష్ బాబు సినిమాల విషయానికొస్తే.. గుంటూరు కారం సినిమా షూటింగ్ ను వేగంగా పూర్తి చేసి 2024 సంక్రాంతికి విడుదల చేయాలని అభిమానులు భావిస్తున్నారు. సర్కారు వారి పాట విడుదలై దాదాపు ఏడాది కావడంతో ఈయన సినిమాల విషయంలో మహేష్ బాబు వేగం పెంచాలని కూడా అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news