RGVని బట్టలు ఊడదీసి కొడుతాం – ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు

-

RGVని బట్టలు ఊడదీసి కొడుతామని హెచ్చరించారు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు. వ్యూహం టీజర్ పై పీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు సంచలన కామెంట్స్ చేశారు. రాంగోపాల్ వర్మ వ్యూహం సినిమాలో సోనియాగాంధీని చెడుగా చూపిస్తే … బట్టలు ఊడదీసి కొడుతామని హెచ్చరించారు.

అసలు వాస్తవాలు వర్మకీ తెలుసా అని నిలదీశారు. తప్పుగా చూపించే ప్రయత్నం చూస్తే ఊరుకోమని.. ఖబడ్దార్ రాంగోపార్ వర్మ అంటూ వార్నింగ్‌ ఇచ్చారు పీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు.
షర్మిల కాంగ్రెస్ పార్టీలోకి వస్తే ఆహ్వానిస్తామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ విధానాలకు , సిద్దాంతాలకు కట్టుబడి ఎవరూ వచ్చిన స్వాగతిస్తామని స్పష్టం చేశారు పీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు. కాగా, నిన్న వ్యూహం సినిమా టీజర్‌ ను వర్మ రిలీజ్‌ చేసిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news