ఓ కర్షకుడా..నీకు తోడుగా నేనున్నా : సీఎం రేవంత్ ట్వీట్

-

కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలైన పూర్తయిన సందర్భంగా విజయోత్సవాలతో పాటు రైతు పండుగ పేరిట సభలు నిర్వహిస్తోంది.ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డి సోషల్ మీడియా ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. రైతాంగానికి నేను తోడుగా ఉన్నానంటూ భరోసానిచ్చారు. ‘భూమికి పచ్చని పైరు.. రైతు మోములో ఉషారు..సంకల్పంతో సర్కారు..ఓ కర్షకుడా..‘సాగు’లో ముందుకు సాగిపో.. నీకు తోడుగా నేనున్నా’ అని ట్వీట్ చేశారు.

మహబూబ్ నగర్‌లో ‘రైతు పండగ’ సభా దృశ్యాల వీడియోను ఈ సందర్భంగా పోస్టు చేశారు. రైతుల కోసం ఈ ఏడాది రూ.54 వేల కోట్లు ఖర్చు చేసినట్లు మహబూబ్ నగర్ వేదికగా రేవంత్ ప్రకటించారు. రూ. 21 వేల కోట్లతో 25 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేసి తమ ప్రభుత్వం చరిత్ర సృష్టించిందన్నారు. రైతుల జీవితాల్లో పండుగ తెచ్చామని, రైతులు మాపై పెట్టుకున్న నమ్మకాన్ని నిజం చేశామని తెలిపారు. కాంగ్రెస్ పాలనలో రికార్డు స్థాయిలో 1.53 కోట్ల టన్నుల ధాన్యం ఉత్పత్తి జరిగిందని పేర్కొన్నారు. ఎసైన్డ్ భూములు, కనీస మద్ధతు ధర, రైతులకు ఉచిత విద్యుత్, రుణమాఫీ చేయడం కాంగ్రెస్ పేటెంట్ అని స్పష్టం చేశారు.

 

Read more RELATED
Recommended to you

Latest news