వాట్సాప్ గవర్నెన్స్ త్వరలో తీసుకు వస్తున్నామని ప్రకటించారు ఏపీ సీఎం చంద్రబాబు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి మంచి చేసిన వారిని ఎలా గుర్తు పెట్టుకోవాలో చెడు చేసిన వారిని కూడా గుర్తు పెట్టుకోవాలని పేర్కొన్నారు. ఇవాళ మీడియాతో ఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడారు. వచ్చే ఏడాది మార్చి 16 నుంచి 125 జయంతి వేడుకలు ప్రారంభం అవుతాయని ఈ సందర్భంగా ప్రకటన చేశారు ఏపీ సీఎం చంద్రబాబు. 125 జయంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు.
పొట్టి శ్రీరాములు పుట్టిన గ్రామాన్ని అభివృద్ధి చేస్తాం, ఆయన ఉన్న ఇంటిని మెమోరియల్ గా మారుస్తామని కీలక ప్రకటన చేశారు. 25 ఏళ్ల ముందే నేను ఐటీ ప్రారంభించానన్నారు. రైస్ మిల్ లో ధాన్యం దించగానే రైతులకి డబ్బులు పడేలా మార్పులు తెస్తామని ప్రకటన చేశారు ఏపీ సీఎం చంద్రబాబు. వాట్సాప్ గవర్నెన్స్ త్వరలో తీసుకు వస్తున్నామన్నారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి సుపరిపాలన అందించేమే ఎన్డీయే కూటమి లక్ష్యమన్నారు ఏపీ సీఎం చంద్రబాబు.